సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ఆచార్య సినిమా రిలీజ్ తరువాత చాల వేగంగా షూటింగ్ పూర్తీ చేసుకొని, నేడు, బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్‌ఫాదర్’ సినిమా టాక్ పర్వాలేదని వచ్చింది. రాజకీయాల నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మాత్రం అదిరిపోయింది అంటున్నారు. సెకండ్ హాఫ్ లో అదే పట్టు కొనసాగించలేకపోయారని , అయితే బి,సి సెంటర్స్‌లోని క్లాస్, మాస్ ప్రేక్షకుల కోసమే సినిమా రూపొందించినట్లు టాక్.. . మళయాలంలో మోహన్ లాల్ హీరోగా హిట్ ఐన ముస్తాఫిర్ కు రీమేక్ గా ఈ సినిమా తెలుగు, హిందీలో రూపొందించారు. ఈ చిత్రం లో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఓ కీలక పాత్రలో నటించారు. మెగాస్టార్ తో కలసి, సల్మాన్ చేసిన సన్నివేశాలలో అనుకున్నంత ఆకర్షణగా చిత్రీకరించలేకపోయారని టాక్. ఇక విలన్ గా సత్య దేవ్ రోల్ సినిమా అంతా చాల పెద్ద స్థాయిలో ఉందని, కానీ మరింత క్రేజ్ ఉన్న నటుడు ఉంటె సినిమా ఇంకా పెద్ద స్థాయికి వెళ్లి ఉండేదని టాక్.. ఇక నయనతార, సునీల్, పూరి జగన్నాధ్, సముద్రఖని వంటి వారు ఇతర పాత్రలలో నటించారు. మోహన్ రాజా దర్శకత్వంలో వచ్చిన గాడ్ పాదర్ భీమవరం లో నేడు, 4 థియేటర్స్ లో విడుదల అయ్యింది. ఓపెనింగ్స్ బాగున్నాయి.ఇక అక్కినేని నాగార్జున నటించిన ఘోస్ట్ సినిమా భీమవరం లో నేడు,బుధవారం 2 థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. గరుడావెగా.. ప్రవీణ్ సత్తార్ తన సత్తా మరోసారి చూపించాడని, మంచి యాక్షన్ టేకింగ్ తో సినిమా చివర వరకు ఎక్కడ తగ్గకుండా ఫన్ తో కలగలసి చాల చక్కగా ఉందని టాక్..నాగార్జున 64 ఏళ్ళ వయస్సులో కూడా యాక్షన్ సీన్లో చెలరేగి నటించాడని టాక్.
