సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పుట్టినరోజును పురస్కరించుకుని వీరమ్మ పార్క్ వద్ద వీరమ్మ యూత్ మారోజు గణేష్, యూత్ సభ్యుల అధ్వర్యంలో అన్నదానం నిర్వహించారు. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తనయుడు గ్రంధి రవితేజ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి స్వయంగా వడ్డించారు. సుమారు 1000 మందికి అన్నసమారాధన నిర్వహించారు. తదుపరి స్థానిక పొట్టి శ్రీరాములు గర్ల్స్ హైస్కూల్ లో విద్యార్థినుల అందరికి ఉచితంగా నోట్ బుక్స్ పంపిణి చేసారు.ఈ కార్యక్రమం లో స్థానిక వైసిపి నేతలు పాల్గొన్నారు. ఇంకా పట్టణంలో జరిగిన పలు సామజిక సంక్షేమ కార్యక్రమాలలో గ్రంధి రవితేజ పాల్గొని తన తండ్రిని అభిమానిస్తున్న అభిమానులకు, వైసిపి క్యాడర్ కు కృతజ్ఞలు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *