సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కన్నడ లో భారీ నిర్మాణంతో కేజీ ఎఫ్ సినిమా సిరీస్ తో సంచలన విజయాలు నమోదు చేసిన కన్నడ నిర్మాత విజయ్ కిరగందూర్ కన్నడ లో నిర్మించిన సినిమా ‘కాంతారా’ ముందుగా కన్నడం లో సెప్టెంబర్ 30 న విడుదల అయింది. అక్కడ పెద్ద విజయం సాధించింది. కన్నడ నటుడు రిషబ్ శెట్టి దీనికి రచయిత,దర్శకుడు, హీరో కూడా.. సప్తమి గౌడ కథానాయికగా చేసింది. ఈ డబ్బింగ్ సినిమాగా తెలుగులో అదే పేరుతొ నేడు, శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఈ కథ ఏమిటంటే.. చాల దశాబ్దాలు క్రితం కర్ణాటక లోని ఒక అటవీ ప్రాంతం ఆనుకొని వున్న ఒక గ్రామంలో. అక్కడ రాజుకు ప్రశాంతత లేదని, ఒకసారి అడవికి వెళ్లి అక్కడ ఒక దేవత విగ్రహం చూసిన వెంటనే తనకు చాల ప్రశాంతంగా ఉందని భావిస్తాడు. వెంటనే అక్కడి ప్రజలకు తన భూమి ఇచ్చి వాళ్ళని సాగుచేసుకోమని, కానీ ఆ గ్రామా దేవతని మాత్రం తనకివ్వమని చెప్పి తీసుకెళ్లి తన ఇంటి దగ్గర పెట్టుకుంటాడు. ఇలా ఏళ్ళు గడుస్తున్నాయి, మధ్యలో అదే వంశం లో వచ్చిన ఒక రాజు భూమిని తిరిగి తీసుకోవడానికి ప్రయత్నం చేయగా, రక్తం కక్కుకొని చచ్చిపోతాడు. గ్రామ ప్రజలు ఆ అడవిని నమ్ముకొని జీవిస్తూ ఉండగా, కొన్నేళ్ల తర్వాత ఆ అడవి, అక్కడ భూములు రిజర్వ్ ఫారెస్ట్‌లో భాగమని, ఫారెస్ట్ ఆఫీసర్ (కిశోర్) అక్కడ వున్న ప్రజలకు చెప్పి భయపెడతాడు. అదే ఊరి పెద్ద, అదే రాజుల వంశస్థుడు కూడా తిరిగి తమ భూములను లాక్కునే ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ గ్రామంలో వున్నా ఒక యువకుడు శివ (రిషబ్ శెట్టి) ఫారెస్ట్ ఆఫీసర్‌కి. ఆ గ్రామా పెద్ద కి ఎదురు తిరుగుతాడు. శివకి అప్పుడప్పుడూ కలలోకి ఒక దేవత వచ్చి అతనికి ఎదో చెపుతూ ఉంటుంది. ఆ దేవత ఎవరు? భూములు కోసం పోరాటం చేస్తున్న శివ పరిస్థితి ఏమిటి ? అన్నది మిగతా కథ. సినిమాలో అడవి, గ్రామము, పొలాలు, పశువులు , గ్రామా పెద్ద వ్యవహార సైలి, అప్పటి ప్రజలు ఇవన్నీ సినిమాలో సహజంగా చూపించడటంలో రిషబ్ శెట్టి సఫలం అయ్యాడు. సినిమా చివర 20 నిముషాలు థియేటర్ లో వణుకు పుట్టించే అద్భుత నటనతో రిషబ్ శెట్టి అందరినీ అలరిస్తాడు. కాంతారా సినిమాకి సంగీతం అందించిన అజనీష్ లోక్‌నాథ్ ఒక హైలైట్, ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదుర్స్.. అలాగే పోరాట సన్నివేశాలు హైలైట్.. సినిమాటోగ్రఫీ, అరవింద్ చిత్రీకరణ అందమైన దృశ్య కావ్యాన్ని తలపిస్తుంది. నిజంగా వెండి తెరపై మాత్రమే చూడవలసిన సినిమా ‘కాంతారా’
