సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: విశాఖలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విశాఖపట్నం జనవాణి కార్యక్రమంనకు విచ్చేయగా ఆ కార్యక్రమం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం అడుగడుగునా అనేక ఇబ్బందులు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ, విశాఖలో జనసేన నాయకులను అక్రమంగా అరెస్టు చేసారని ఆరోపిస్తూ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు, భీమవరం నియోజకవర్గం ఇంఛార్జి కొటికలపూడి గోవిందరావు అధ్వర్యంలో నేడు, సోమవారం ఉదయం 10 గంటలకు భీమవరం నియోజవర్గం జనసేన పార్టీ కార్యాలయం నుండి జనసేన నేతలు ర్యాలీగా వెళ్లి నిరసన తెలియజేస్తూ ప్రకాశం చౌక్ లో గల అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమములో రాష్ట్ర PAC సభ్యులు కనకరాజు సూరి , జిల్లా ప్రధాన కార్యదర్శి, ఉండి నాయకులు జుత్తిగా నాగరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి గవర లక్ష్మి, ,భీమవరం పట్టణ అధ్యక్షులు చెనమల్ల చంద్ర శేఖర్, సెక్రటరీ సుంకర రవి, భీమవరం మండల అధ్యక్షులు మోకా శ్రీనివాస్,సెక్రెటరీ కత్తుల నిలెంద్ర, వీరవాసరం మండలం అధ్యక్షులు గుండా రామకృష్ణ, కాళ్ల మండల అధ్యక్షులు రాము,mpp అడ్డాల రాము,ఎంపీటీసీ లు గుల్లిపల్లి విజయలక్ష్మీ, తాతపూడి రాంబాబు, అరేటి వాసు ,ఆకుల మౌనిక, మాజి కౌన్సిలర్స్ మగాపు ప్రసాద్, వానపల్లి సూరిబాబు, బండి రమేష్, ఉండవల్లి శ్రీను,ఏడుకొండలు, పంతం ప్రసాద్,త్రివిక్రమ్,తదితర నేతలు వీర మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *