సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు , సోమవారం వైజాగ్ నుండి విజయవాడ కు చేరుకొన్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. సీఎం జగన్ మోహన్ రెడ్డి పాలన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖలో పోలీసులు జనసేన కార్యకర్తలపై వ్యవహరించిన తీరు, కేసులు పెట్టిన తీరు దారుణమన్నారు. తమ ఫై కేసులు బనాయిస్తే బెదిరిపోయే వాళ్లం కాదని హెచ్చరించారు. అక్కడ అరెస్టు చేసిన ప్రతి జనసేనానికి మా లీగల్ టీం అండగా ఉంటుందన్నారు. తాము ప్రభుత్వంపై నిర్మాణాత్మక విమర్శలే చేశామే తప్ప వ్యకిగతంగా విరామర్శించలేదన్నారు. ఒక పార్టీ కార్యక్రమానికి ఎదురెళ్లే ఉద్దేశం తమకు లేదన్నారు. తాను అర్ధాంతరంగా విశాఖ రాలేదని, వైసీపీ గర్జన కంటే ముందే షెడ్యూల్ ఖరారు చేసుకున్నామని, వైసీపీలా మాట మార్చే అలవాటు తమకు లేదన్నారు. ప్రభుత్వంలో ఉండి గర్జనలు, కూతలు పేరుతో ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టాలని చూస్తున్నారు. మూడు రాజధానుల ప్రతిపాదన జనంలోకి కెళ్లడం లేదు .. అందుకే ప్రభుత్వమే గర్జన చేయిస్తుంది. మా కార్యకర్తలపై కేసులకు భయపడి వెనకడుగు వేసే వ్యక్తులం కాదు. మేం కూడా కవ్వింపు చర్యలకు దిగితే ఏం చేస్తారు? దాడులను ప్రోత్సహించే సంస్కృతి జనసేనది కాదు. అని పవన్ పేర్కొన్నారు. ఇక్కడ ఇతర పార్టీ నేతలు గొంతెత్తితే అరెస్ట్‌లు చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో మాకు మాట్లాడే స్వేచ్ఛ లేదా? పోలీసులతో మాకు గొడవ లేదు, ప్రభుత్వంపైనే మా పోరు. వైసీపీ విముక్త ఏపీ కావాలి. భవిష్యత్ తరాలు బాగుండాలంటే వైసీపీని ఓడించాలి.’ అని పవన్ ఆగ్రహం వ్యక్తం చేసారు.
