సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశంలో గత రెండు నెలల్లో, పలు బ్యాంకులు ఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచుతూ వస్తున్నాయి. దీనిలో భాగంగా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంకు లు తాజా ప్రకటనలతో ఇప్పటి నుండి ఫిక్సిడ్ డిఫాజిట్స్ చేస్తున్న ఖాతాదారులకు పెంచిన వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తున్నారు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన ఖాతాదారులకుఫిక్స్ డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్ల 7 శాతం దాకా వడ్డీని అందిస్తుంది. ఫిక్స్ డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు నిన్నటి నుండి (అక్టోబర్ 17 నుం డి) అమలులోకి వచ్చా యి. 7 – 14 రోజుల మధ్య మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 3 శాతం , 599 రోజుల ఫిక్స్ డ్ డిపాజిట్లపై గరిష్టంగా ఏడు శాతం వడ్డీ లభిస్తుంది. ఒక ఏడాది లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై, 5.25శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఒక సంవత్సరం మెచ్యూరిటీ కాలానికి, రాబడి రేటు 6.30 శాతం సంవత్సరం – 443 రోజుల కంటే ఎక్కువ మెచ్యూరిటీ ఉన్న FDలకు వడ్డీ రేటు 6.6 శాతంగా ఉంది. ఇక కెనరా బ్యాంకులో 666 రోజుల ఫిక్సిడ్ డిపాజిట్ కు 7శాతం వార్షిక రేటు అదే సీనియర్ సిటిజన్స్ కు 7న్నర శాతం వరకు ఆఫర్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *