సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్; ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ టి.కె.రాణా ఆదేశాల మేరకు డీసీపీ విశాల్ గున్నీ నేతృత్వంలో విజయవాడ నగరం పరిసరాలలో పలుచోట్ల స్పా , సెలూన్లు, వెల్నెస్ సెంటర్లు, బ్యూటీ పార్లర్ల ముసుగులో, క్రాస్ మసాజ్, వ్యభిచారం నిర్వహిస్తున్న పలువురిపై గత వారం రోజులుగా వీటిపైన పోలీసులు విస్తృ తంగా దాడులు చేస్తున్నారు. మొత్తం 18 బృందాలు ఈ తనిఖీల్లోపాల్గొం టున్నా యి.‘స్థానిక మాచవరం, మొగల్రాజపురం, బెంజిసర్కిల్ తదితర ప్రాంతాల్లో 190కి పైగా స్పా సెంటర్లు ఉన్న ట్లు పోలీసులు గుర్తించారు. వీటిలో ఇప్పటికే 60 స్పా లపై దాడులు చేసి, నిబం ధనలకు విరుద్ధంగా నడుస్తున్న 46 స్పాలను సీజ్ చేశారు. ఇప్పటి వరకు దివ్య యూనిసెక్స్ అండ్ బ్యూ టీ సెలూన్, గోల్డెన్ ఓక్స్ , హనీ బ్యూటీస్పా , ఫర్యూఫ్యామిలీ సెలూన్సెంటర్లలో క్రాస్ మసాజ్ జరుగుతున్న ట్లు గుర్తించి, అందుకు తగిన ఆధారాలు లభించడంతో ఏడుగురు స్పా నిర్వా హకులను అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. వ్యభిచారం కోసం వచ్చిన 18 మంది విటులను అదుపులోకి తీసుకున్నారు. 28 మంది బాధిత యువతులను గుర్తించి వారిని తాత్కా లికంగా హోమ్స్ లో ఉంచి వారి సొంత ఊళ్లకు పంపే ఏర్పా ట్లు చేస్తున్నారు. పోలీసులు దాడులు చేస్తుం డటంతో కొన్ని స్పా లను నిర్వాహకులు స్వయంగా మూసివేశారు. విజయవాడ నగరంలో అసాం ఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేసేం దుకు పోలీసులు పకడ్బం దీ చర్యలు చేపడుతున్నా రు.
