సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పవన్ కళ్యాణ్ నువ్వు ప్యాకేజి స్టార్ అని నేను అంటాను.. దమ్ముంటే భీమవరంలో ఇక్కడే ఉంటాను.. నా దగ్గరకు రా! ఏం చంపుతావా? ఎవరిని బెదిరిస్తున్నావ్ ?చూద్దాం! దమ్ముంటే 2024 ఎన్నికలలో భీమవరం నుండే స్వంత పార్టీ బలంతో పోటీ చెయ్యి! మరల ఓడిస్తాను! ఇదే నా సవాల్ అన్న ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాటలు తెలుగునాట మీడియాలో బాగా వైరల్ అవుతున్న నేపథ్యంలో … నేడు, మంగళవారం భీమవరంలో జనసేన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ జిల్లా అడ్జక్షుడు , కొటికలపూడి గోవిందరావు (చినబాబు)మాట్లాడుతూ.. ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ గారు చాల ఆవేశంతో ఏకవచనంతో మా అధినేతను విమర్శిస్తూ.. సవాళ్లు చేస్తున్నారని, మేము కూడా ఆయనను ఏకవచనం తో పిలవగలం! కానీ అది మా సంస్కారం కాదని అన్నారు. అసలు 2024 ఎన్నికలలో ఆయనకు పార్టీ టికెట్ రాదని భావిసున్నా నేపథ్యంలో మరల టికెట్ ఇస్తారన్న ఆశతో..అధిష్టానం దృష్టిలో పడటానికి పవన్ కళ్యాణ్ ను ఇంత స్థాయిలో విమర్శించారని భావిస్తున్నామని, మా అధినేతని తలుచుకోవడం మాని ముందు నియోజకవర్గ అభివృద్ధి మీద ద్రుష్టి పెడితే బావుంటుంది. మీకు..దమ్ముంటే ఈ నెల 30వ తేదీలోగా మీరు భీమవరం బైపాస్ రోడ్డు లో గుంతలు, పూడ్చి మిగిలిన రోడ్డు వేయించాలని, అలాగే వచ్చే మార్చి నెల లోపు బుధవారం మార్కెట్ లో నీటి రిజర్వాయర్ పనులు ,తాడేరు వంతెన పనులు పూర్తి చేసి అప్పుడు మా అధినేత పవన్ కళ్యాణ్ గారి గురించి సవాళ్లు విసిరితే బాగుంటుందని సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో పిఎసి సభ్యుడు వేగేశ్న కనకరాజు సూరి, జిల్లా కార్యదర్శి, చెన్నమల్ల చంద్రశేఖర్ , నరసాపురం ఇంచార్జి బొమ్మిడి నాయకర్, తదితర జిల్లా స్థాయి, పట్టణ నేతలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *