సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం గునుపూడి ప్రాంతంలో పవిత్ర పుణ్యక్షేత్రంగా విరాజిల్లు తున్న .. పురాణాలలో పేర్కొన్న పంచారామాలలో ఒకటైన శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి దేవాలయం లో ఈ నెల 26వ తేదీ నుండి నెలరోజుల పాటు జరిగే కార్తీక మహోత్సవాలకు వచ్చే లక్షలాది భక్తుల కోసం సకల ఏర్పాట్లతో సిద్ధం అవుతుంది. పంచారామ క్షేత్రాలలో ఇక్కడి శివలింగాన్ని సాక్షాతూ చంద్రుడు ప్రతిష్టించాడని, అందుకే అమావాస్యకు పౌర్ణమికి చంద్రుడు ( సోముడు) తరహాలోనే రంగులు మారటం జరుగుతుందని స్కంద పురాణం లో పేర్కొనడంతో .. ఆ మహత్తు ఇప్పటికి భక్తులకు అవగతం అవుతుండటంతో ఎంతో దూరప్రాంతాల నుండి కార్తీక మాసం లో సోమేశ్వర దర్శనానికి భక్తులు తరలి వస్తారు. ఈ సందర్భముగా దేవాలయ కార్యనిర్వాహణ అధికారి,ఎం అరుణ్ కుమార్ మన సిగ్మా న్యూస్ తో మాట్లాడుతూ.. కరోనా ప్రభావం లేకపోవడంతో ఈ ఏడాది కార్తీక మాసం భక్తులు రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని గుర్తించి, నూతన ధర్మకర్తల మండలి, దాతలు సహకారం, స్వచ్చంద సేవకులు ఆధ్వర్యంలో దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎన్నో ఏర్పాట్లు , నిత్యా ప్రసాద వితరణ, మంచినీటి పంపిణి, తదితర ఏర్పాట్లు చేసున్నామని , ప్రతి సోమవారం తెల్లవారు జాము 2గంటల నుండే స్వామివారి దర్శనం ఉంటుందని, మిగతా రోజులలో తెల్లవారు జాము 4గంటల నుండి దర్శనాలు ఉంటాయని, భక్తులు వేగంగా దర్శనం చేసుకోవడం కోసం అదనంగా ప్రత్యేక క్యూ లైన్ లు ఏర్పాటు చేశామని, భక్తులు సౌకర్యం కోసం దేవాలయ ఆవరణలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, చలువ పందిళ్లు, శ్రీస్వామివారికి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు,సేవలు పల్లకి ఊరేగింపులుతో పాటుగా, ప్రతి సాయంత్రం నుండి సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు ,చంద్ర పుష్కరిణి దగ్గర మహిళలు కార్తీక దీపాలు వెలిగించుకొనే ఏర్పటు చేస్తున్నామని, దాతల భూరి విరాళాలతో ప్రతి ఆదివారం, సోమవారం భక్తులకు మహా అన్నసమారాధన కార్యక్రమాలు జరుగుతాయని, దూరప్రాంతాల నుండి పంచారామ క్షేత్రాలు దర్శించే భక్తులు వాహనాలు పార్కింగ్ కోసం గునుపూడి ఎఫ్ సి ఐ గౌడాన్ ల వద్ద స్టే ఏర్పాటు చేస్తున్నామని, రాత్రి పూట 10 గంటల వరకు శ్రీ సోమేశ్వరుని దర్శించుకోవచ్చునని, భక్తుల రద్దీ బట్టి సమయం పెంచుతామని, దేవాలయ ఆవరణలో పోలీస్ నిఘా , సమాచార కేంద్రం ఉంటుందని ప్రకటించారు.
