సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల ఇరు పక్షాల నుండి తరచూ ఉద్రిక్తలకు, గంటలకొద్దీ ప్రయాణికుల ట్రాఫిక్ జామ్ లకు దారితీస్తున్న అమరావతి పాదయాత్ర విషయంలో హైకోర్టు శుక్రవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. పాదయాత్రలో కేవలం 600 మంది నిజంగా రైతులు మాత్రమే ఉండాలని, వారి పూర్తీ వివరాలు డీజీపీకి అందచేసిన జాబితాలో ఉన్న వ్యక్తులే పాల్గొనాలని స్పష్టం చేసింది. పాదయాత్రకు సం ఘీభావం తెలపాలనుకునే వ్య క్తులు రోడ్లకు ఇరువైపులా ఉండి మద్దతు తెలపవచ్చని, అయితే వారు ఎట్టి పరిస్థితుల్లోనూ యాత్రలో పాల్గొనడానికి వీల్లేదని ఆదేశించింది. ఈమేరకు చర్యలు తీసుకోవాలనిపోలీసులను ఆదేశిం చిం ది. దీనివల్ల అసాంఘిక శక్తులతో శాంతి భద్రతల సమస్య సృష్టిస్తున్నా రంటూ పిటిషనర్లు వ్య క్తం చేస్తున్న ఆందోళన తొలగిపోతుందని పేర్కొంది.పాదయాత్ర మార్గంలో ఇతరులు పోటీ కార్య క్రమాలు చేపట్టేం దుకు అనుమతులు ఇవ్వొద్దని, అయితే సమీపదూరం ఎంత ఉండాలన్నది పోలీసులే నిర్ణయిస్తారని హైకోర్టు స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *