సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమగోదావరి జిల్లా జనసేన జిల్లా అధ్యక్షుడు గోవిందరావు( చినబాబు) నేడు, శనివారం భీమవరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తరచుగా మా పార్టీ అధినేత ను, జన సైనికులను కించపరుస్తూ , నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని, దీనిపై జన సైనికులు ఆగ్రహంతో రగిలిపోతున్నారని, మీరు అభివృద్ధి కార్యక్రమాలు చేసి మాట్లాడండి అని మీకు గౌరవం ఇస్తుంటే మీరు దానిని పుచ్చుకోకుండా..నోరు అదుపులో పెట్టుకోకుండా పవన్ కళ్యాణ్, జనసైనికులు గురించి మాట్లాడితే ఇకపై వెయ్యి బూతులు వస్తాయి. ఇదే ఆఖరిసారిగా మిమ్ములను హెచ్చరిస్తున్నాను అన్నారు. ఏకంగా పవన్ కళ్యాణ్ నే ఓడించానని గొప్పలు పోకుండా , తమరు గతంలో ఓడిన విషయం గుర్తుంచుకోవాలని విమర్శించారు. ఇంటిటికి వెళ్లి ఫొటోలు దిగుతున్నారని, అయితే అందులో పలువురు ప్రజలు మీకు ఓటు వేయకపోతే.. మీరు ఓటువెయ్యకుండా ఎలా ప్రశ్నిస్తారు అని అడుగుతూ వారిని కించపరుస్తున్నారని .. మీకు అసలు రాజ్యాంగ తెలుసా? మీ బిహేవియర్, ఆలోచనల వల్ల 2009 లో రాజశేఖరరెడ్డి టికెట్ ఇవ్వలేదు. మీరు అసలు భీమవరంప్రజలు కోసం ఏమి పోరాటాలు చేసి ఏమి అభివృద్ధి సాధించారో అర్ధం కావడం లేదని, ఎవరో సాదించినవి మీ పేరు పేరున చెలామణి చేస్తారని , ఇటీవల 5 అండర్ టర్నల్ రైల్వే బ్రీజ్ లు మీరే కట్టేసినట్లు బిల్డప్ ఇస్తున్నారు. కానీ 2012 నుండి రైల్వే డబ్లింగ్ నిర్మాణాలు జరుగుతున్నాయి. అప్పటికే వాటి అనుమతులు వచ్చాయని, వాటి ఆధారాలు సమాచార చట్టం ద్వారా సేకరించామని, అలాగే మహాత్మా గాంధీగారి సతీమణి కస్తూరిబా కాలేజీ కి 30 సెంట్లు స్థలం ఇచ్చి మీ కుటుంబ పేరు పెట్టేసుకొన్నారని విమర్శించారు. ప్రభుత్వ హాస్పిటల్ నిర్మాణానికి 4 ఎకరాలు స్థలం మీరు దానంగా ఇస్తే 10 కోట్ల కేంద్ర నాబార్డ్ నిధులు వచ్చాయి తప్ప, రాష్ట్ర ప్రభుత్వం నుండి ఒక్క రూపాయి రాలేదని , ఇదేనా సీఎం జగన్ వద్ద మీ సమర్ధత..?నా హయాంలో టిడికో ఇళ్ళు 2000 పైగా అప్పట్లోనే పూర్తీ చేస్తే ఇప్పుడు పేదలకు పంచి మీ పేరు వేసుకొన్నారని వారికీ వసతులు లేవని విమర్శించారు..త్వరలో తాను, జన సైనికులు వెంప నుండి తాడేరు వంతెన వరకు పాదయాత్ర చేస్తాం..తాడేరు వంతెన ఫై మా పోరాటం అన్నారు చినబాబు..ఈ సమావేశంలో PAC సభ్యులు కనకరాజు సూరి , జిల్లా ప్రధాన కార్యదర్శి, భీమవరం పట్టణ అధ్యక్షుడు చెనమల్ల చంద్ర శేఖర్,సెక్రటరీ సుంకర రవి, మోకా శ్రీనివాస్,కత్తుల నీలెంద్ర, Mptc లు తాతపూడి రాంబాబు, అరేటి వాసు, గుల్లిపల్లీ విజయలక్ష్మీ, సూరిబాబు, త్రివిక్రమ్ తదితరులు పాల్గొన్నారు.
