సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి లోని హైకోర్టుతోపాటు ఇటు అన్ని జిల్లా కోర్టుల్లో సుదీర్ఘకాలం గా ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి హైకోర్టు చర్యలు తీసుకొంది. ఇప్పటివరకు హైకోర్టులో పెద్ద సంఖ్య లో పోస్టుల ఖాళీలతో ప్రస్తుతమున్న ఉద్యోగులు తీవ్ర పని ఒత్తిడిని ఎదుర్కొం టున్నా రు. ఇది హైకోర్టు పాలనపై తీవ్ర ప్రభావం చూపుతుండటంతో ఖాళీల భర్తీపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాం త్కుమార్ మిశ్రా చర్యలు తీసుకొన్నారు. ఇందులో భాగంగా ఇటీవల సీనియర్ ఉద్యోగులందరికీ పదోన్నతులు ఇచ్చేసి వారి స్థానాలలో ఏర్పడిన ఖాళీలను సైతం ఇప్ప టికే ఉన్న ఖాళీలతో కలిపి భర్తీచేయాలని నిర్ణయించారు. అందుకనుగుణంగా హైకోర్టులో వివిధ కేటగిరీల్లో 241 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీచేసింది. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జిల్లా కోర్టుల్లోవివిధ కేటగిరీల్లో3,432 పోస్టుల భర్తీకి హైకోర్టు వర్గాలు నోటిఫికేషన్లు జారీచేశాయి. అటు హైకోర్టు, ఇటు జిల్లా కోర్టుల్లోపోస్టుల భర్తీకి సంబంధించిన నోటిఫికేషన్లను హైకోర్టు వెబ్సైట్ http://hc.ap.nic.in (http://hc.ap.nic.in)లో పొందుపరిచారు. హైకోర్టు ఉద్యో గాలకు ఈ నెల 29 నుం చి నవంబర్ 15వరకు దరఖాస్తులు అందుబాటులో ఉంటాయి. దరఖాస్తులను నవంబర్ 15 రాత్రి 11.59లోపు online లో సమర్పించాల్సి ఉంటుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *