సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం రూరల్ సీఐగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన నాగప్రసాద్ స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాసు ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ఇక్కడ భీమవరం పరిసర రురల్ గ్రామాల్లో ప్రజలు శాంతి ప్రియులని, వారితో గౌరవపూర్వకంగా వ్యవహరిస్తూ.. డ్యూటీ పట్ల పూర్తీ నిబద్దత పాటిస్తూ శాంతి భద్రతలు పరిరక్షించాలని ఆదేశించారు. గతంలో విజయవాడలో పనిచేసిన సీఐ నాగ ప్రసాద్ భీమవరం రూరల్ పోలీస్ స్టేషన్కు బదిలీపై వచ్చారు.
