సిగ్మాతెలుగు డాట్ ఇన్, న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని అధికారుల కమిటీ 11వ వేతన సవరణ కమిషన్‌ నివేదికను అధ్యయనం చేసిన కమిటీ పలు సిఫార్సులతో క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌కు నివేదిక సమర్పించింది. ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలి అని కీలక సిఫార్స్ చేసింది. ముఖ్యమంత్రికి సీఎస్‌ కమిటీ చేసిన రిపోర్టులో చేసిన కీలక విషయాలు ఏమిటంటే..ఐదేళ్లకు ఒకసారి వేతన సవరణను రాష్ట్రం భరించలేదు .రాష్ట్ర సొంత ఆదాయాన్ని మించి ఉద్యోగుల వేతనాల వ్యయం అవుతోందని,పేర్కొన్నారు. కోవిడ్‌ కష్టాల్లోనూ ఉద్యోగుల ప్రయోజనాలను ప్రభుత్వం కాపాడింది. ఇప్పటికే ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల వ్యయం రూ.52,513 కోట్ల నుంచి రెండేళ్లలో రూ.67,340 కోట్లకు పెరిగింది …కొద్ది సంవత్సరాలుగా మంజూరైన ఫిట్‌మెంట్‌ ఎక్కువగా ఉందని గమనించాలి. రాష్ట్ర సొంత రాబడికి మించిన ఖర్చు హెచ్‌ఆర్‌ వ్యయం పెరగడానికి దారి తీసింది.10వ పీఆర్సీ 29 శాతం ఫిట్‌మెంట్‌ సిఫార్సు చేస్తే అంతకు మించి 43% మంజూరు చేశారు. తెలంగాణలో పీఆర్‌సి 7.5% ఫిట్‌మెంట్‌ సిఫారసు చేసింది, ఏపీలో 11వ రాష్ట్ర పీఆర్సీ కమిటీ ఐదేళ్లకు 27 శాతం ఫిట్‌మెంట్‌ సిఫార్సు చేసింది. ఈ సిఫార్సు చాలా ఎక్కువగా ఉంది అని పేర్కొంది. 2018–19లో రాష్ట్ర ప్రభుత్వం సొంత ఆదాయం (ఎస్‌ఓఆర్‌)లో ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల మొత్తం 84 శాతం కాగా 2020–21 నాటికి 111 శాతానికి చేరుకుంది. ప్రభుత్వ మొత్తం వ్యయంలో ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల కోసం చేస్తున్న వ్యయం 2018–19లో 32 శాతం అయితే 2020–21 నాటికి 36 శాతానికి పెరిగింది అని కమిటీ నివేదిక లో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *