సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆకివీడు నగర పంచాయతీలో గల 17వ వార్డు సమతా నగర్ లో సరైన రోడ్లు, ఇంకా డ్రైనేజీ మంచినీటి సదుపాయాలు లేనందున వాటిని ప్రజలకు అందుబాటులోకి తేవాలని స్థానిక జనసేన పార్టీ కౌన్సెలర్స్, నేతలుగతంలో అనేక నిరసన కార్యక్రమాలు చేయడం జరిగింది.అయినప్పటికీ అధికారులు స్వాందించడం లేదని , అందుకే ఆ వార్డు ప్రజల కోసం స్థానికే జనసేనా నేతలు గత మంగళవారం ఉదయం 9 గంటల నుండి రాత్రి 9గంటలవరకు నిరాహార దీక్ష చేసారు. అయిన ఇంకా అధికారుల నుండి స్వాందన రాలేదని.. ఇంకా అధికారులు నాయకులు స్పందించకపోతే ఆ ప్రాంత ప్రజల కోసం మరొక నిరాహార దీక్ష చేస్తామని, ఆ ప్రజలకి జనసేన పార్టీ అండగా ఉందని చెప్పి, జనసేన కార్యకర్తలు ప్రజా సమస్యలపై పోరాటంలో ఎప్పడు ముందుంటారని జనసేన స్థానిక నేతలు తాజగా ప్రకటించారు.
