సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల దేశవ్యాప్తంగా సర్ లో ఓట్ల తొలగింపు ఓటు చోరీ, ఓటింగ్ మిషన్ ఈవీఎంలు ను హ్యాక్? చేశారు అంటూ అనేక ఆరోపణలు వివాదాలు తో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఉక్కరిబిక్కిరి అవుతున్న కేంద్ర ఎన్నికల కమిషన్ లో ఉన్న ముగ్గరిలో విభేదాలు పొడసూపయని కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి తొత్తుగా వ్యవరించకూడని ఇద్దరు సభ్యులు విభేదిస్తున్నారని ప్రముఖ జాతీయ పత్రిక రాసిన కధనం దేశవ్యాప్తంగా సంచలం రేపింది. ఈనేపథ్యంలో కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చెయ్యాలని కాంగ్రెస్ తో సహా ప్రధాన పార్టీ పక్షలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీలో 2024 జరిగిన ఎన్నికలలో ఎదో జరిగిందని , అసలు ప్రజా తీర్పు కు వ్యతిరేకంగా తాము నష్టపోయామని అనుమానం వ్యక్తం చేస్తున్న వైసీపీ అధినేత జగన్ తాజగా ఎక్స్ వేదికగా ఒక పోస్టు చేసారు.. దానిలో…కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామక చట్టం-2023ను పునఃసమీక్షించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సంఘం నిర్ణయాలు, ఓటర్ల జాబితాలపై స్పష్టత ఇవ్వాలని ‘ఎక్స్’ వేదికగా పేర్కొన్నారు. ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడాలని, ఓటు హక్కును వినియోగించుకునేలా వ్యవస్థలను పటిష్ఠం చేయాలని కోరారు. ఎన్నికల సంఘం కమిషనర్ల మధ్య విబేధాలు ఉన్నట్లుగా కథనాలు రావడం, ఓటర్ల జాబితాపై ఆరోపణలు వస్తున్న దృష్ట్యా సీఈసీ నియామక చట్టాన్ని తక్షణమే పునఃసమీక్షించాల్సి ఉందన్నారు.
