సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పరిసర ప్రాంతాలలో పవిత్ర కార్తీక మాస నేపథ్యంలో పలు సంఘాలు, కులాలు వారి వారి వన సమారాధన విందులు, ఆటపాటలు నిర్వహిస్తున్న నేపథ్యంలో నేడు, ఆదివారం భీమవరం అగ్రికల్చర్ మార్కెటింగ్ యార్డ్ లో శ్రీ వాసవీ ఆర్యవైశ్య సంఘం వారి ఆధ్వర్యంలో జరిగిన కార్తీక మాస వన సమారాధన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు అయిన శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేను రాజు ను ఆయన కుమారుడు సుందర్ రాజు ను వేద మంత్రాల నడుమ ఘనంగా సన్మానించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భీమవరంలో ఆర్యవైస్యులు న్యాయంగా వ్యాపారం చేస్తూ అనేక సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తారని వారిని అభినందించారు.
