సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: దేశవ్యాప్తం గా నేడు, స్వర్గీయ ,సర్ధార్ వల్లభాయ్ పటేల్ సంస్మరణ దినోత్సవం గా “రాష్ట్రీయ ఏకతా దివాస్ వేడుక’లను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో భీమవరం లో విష్ణు పార్మసీ కళాశాల విద్యార్థిని, విద్యార్థులు భారీ సంఖ్యలో నేడు, సోమవారం ఉదయం 8గంటలకు స్థానిక విష్ణు ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణం నుండి సర్ధార్ వల్లభాయ్ పటేల్ ఫ్లెక్సీ బ్యానర్ ను చేతబూని మువ్వన్నెల జాతీయ పతకాలను పట్టుకొని భారత్ మాత కి జై అంటూ .. 3కే రన్ ను బివి రాజు చోరస్తా వైపు ప్రారంభించారు. ఈ సందర్భముగా వక్తలు మాట్లాడుతూ.. బ్రిటీష్ శృంఖలాల నుండి విముక్తి పొందిన భారతదేశంలోని 525 పైగా స్వతంత్ర సంస్థానాలను, రాష్ట్రాలను తన ఉక్కు సంకల్పంతో ఏకం చేసి అఖండ భారతాన్ని సాధించిన మొదటి భారత హోమ్ మంత్రివర్యులు.ఉక్కుమనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ సంకల్పాన్ని, దేశభక్తి ని ప్రతిఒక్కరు ఆదర్శంగా తీసుకోవాలని ఆయన ను ఘన నివాళులు అర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *