సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తెలుగు రాష్ట్రాలలో .కార్పొరేట్ విద్యాసంస్థల ప్రముఖులుగా ప్రసిద్ధి పొందిన టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణకు చిత్తూరు 9వ అదనపు జిల్లా కోర్టులో నేడు, సోమవారం చుక్కెదురైంది. ఆయనకు బెయిల్ రద్దు చేసారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఆయనకు చెందిన నారాయణ విద్యాసంస్థల ఉద్యోగుల ద్వారా టెన్త్ పరీక్ష పత్రాల లీక్ కేసు లో మాజీమంత్రి నారాయణపై చిత్తూరు పోలీసులు కేసు నమోదు చేసి ఈ ఏడాది ఏప్రిల్‌లో అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. అయితే న్యాయస్థానం అయనకు బెయిల్ మంజూరు చేసింది. దీంతో కింది కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని ప్రభుత్వం తరఫు న్యాయవాది చిత్తూరు కోర్టులో మరో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం నారాయణ బెయిల్ రద్దు చేస్తూ నవంబర్ 30వ తేదీ లోపల పోలీసుల ఎదుట లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది.
