సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరంలోని అన్ని శివాలయాలు భక్త సందోహంతో మంచు తెరల మధ్య కార్తీక దీప శోభా తో కళకళ లాడుతున్నాయి. గునుపూడి పంచారామ క్షేత్రం నేడు, సోమవారం సుమారు 50 వేల భక్తులతో పోటెత్తిపోయింది. తాజా సమాచారం ప్రకారం రాత్రి 9గంటలకు కూడా దూరప్రాంతాల నుండి భక్తులు వచ్చి శ్రీ సోమేశ్వరుని దర్శించుకొని దీపారాధన చేస్తున్నారు. తాజగా సాయంత్రం 6గంటల వరకు కార్యనిర్వహణాధికారి.ఎం అరుణ్ కుమార్ అందించిన సమాచారం ప్రకారం కార్తీకమాసం 1వ సోమవారం సందర్బముగా లడ్డు ప్రసాదం విక్రయాలు ద్వారా ద్వారా రూ.36,225/-లు, ప్రత్యేక దర్శనం టిక్కెట్ల ద్వారా రూ.5,80,000/-లు వెరశి రూ.6,16,225/-లు ఆదాయం వచ్చినట్లు సమాచారం. అభిషేకాలు, ప్రత్యేక పూజలతో అలసిన శ్రీ సోమేశ్వరునికి నేటి సోమవారం సాయంత్రం చేసిన విశిష్ట అలంకారం ఫై చిత్రంలో చూడవచ్చు.. ఎలాగైనా పంచారామ క్షేత్రాలలో రంగులు మారే అపూర్వ లక్షణం ఉన్న భీమవరం శ్రీ సోమేశ్వరుడు మహా అందగాడు.. అలంకార ప్రియుడు ఫై దృశ్యం చూసి చెప్పండి.. ఓం శివోహం…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *