సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: పవిత్ర 5 పంచా రామాలలో పశ్చిమగోదావరి జిల్లాలో 2 ఇక్కడే ఉండటంతో భీమవరం శ్రీ సోమారామం, పాలకొల్లు శ్రీ క్షీరా రామలిం గేశ్వ ర స్వా మి దేవస్థానంలలో నేడు, కార్తిక మాసం 2వ సోమవారం తెల్లవారుజాము 2గంటల నుంచి స్వామివారి ప్రత్యేక అభిషేకాలకు, దర్శనానికి భక్తులు అధిక సం ఖ్య లో పోటెత్తారు. జిల్లాలో అన్ని ప్రముఖ శివాలయాలు పోటెత్తాయి.ఈరోజు పౌర్ణమి రాత్రిగా రావడం వల్ల ప్రతిఇంటా నోములు నోచుకునేవారు ఉపవాసం ఉండి కుటుంబ సమేతంగా రాత్రి పూజ, విందు నిర్వహించుకొనే ముందు పురోహితునికి సాలిగ్రామ దానం ఇచ్చి.. శివాలయాల్లో 365 వత్తుల దీపారాధన చేసే సాంప్రదాయ నేపథ్యంలో నేటి సాయంత్రం నుండి భీమవరం గునుపూడి లోని సోమారామంలో రికార్డు స్థాయిలో వేలాదిగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉండటంతో మరింత వేగంగా స్వామి దర్శనం చేసేందుకు దేవాలయ ధర్మకర్తల మండలి సభ్యులు, స్వచ్చంద సేవకుల సహకారంతో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు కార్యనిర్వహణాధికారి ఎం అరుణ్ కుమార్ తెలిపారు. గత కార్తీకమాసం 2వ ఆదివారం సందర్బముగా లడ్డు ప్రసాదం విక్రయించుట ద్వారా రూ.19, 440/-లు దర్శనం టిక్కెట్ల ద్వారా రూ.2,10, 000/-లు వెరశి రూ.2, 29, 440/-లు ఆదాయం వచ్చిందని తెలిపారు.
