సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: .ఈనెల 11న విశాఖలో ప్రధాని మోదీ, సీఎం జగన్ తో కల్సి పర్యటించనున్న సందర్భంగా.. ప్రధాని పర్యటన వివరాలనువెల్లడించడానికి ఎంపీ, జీవీ ఎల్ నరసింహారావుతో కలిసి, బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్య క్షుడు సోము వీర్రాజు తాజగా విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశం లో మాట్లాడుతూ.. విశాఖ లో కీలకమైన అభివృద్ధి పనులు అన్ని కేంద్ర ప్రభుత్వ నిధులతోనే చేపడుతున్నామని, ప్రధాని పర్యటనను విజయవంతం చెయ్యాలని ప్రజలను కోరారు. . అయితే ప్రధాని మోదీ పర్యటన వివరాలను వైసిపి ఎం పీ విజయసాయిరెడ్డి ముందే ప్రకటించారని మీరు ఆలస్యం చేసారేమిటి అని ప్రశ్నించగా.. కేంద్రం చేస్తున్న అభివృద్ధిపై క్రెడిట్ కొట్టేసేందుకు వైసిపి నేతలు ఉబలాటపడుతున్నారని , అంతకు మించి ఏమిలేదని వ్యాఖ్యానించారు. మరి మీ మిత్ర పక్షం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ప్రధాని సభకు ఆహ్వానిస్తున్నారా? అని ప్రశ్నించగా సోము వీర్రాజు వెంటనే సమాధానం చెప్పకుండా దాటవేశారు. ( బీజేపీ కి జనసేన మిత్ర పక్షం అని చెపుతున్నప్పటికీ ఎందుచేతనో ఇప్పటివరకు ప్రధాని మోడీ తో కానీ అమిత్ షా తో కానీ పవన్ కళ్యాణ్ భేటీ కాకపోవడం .. భీమవరంలో ప్రధాని సభకు పవన్ ను ఆహ్వానించిన పవన్ రాకపోవడం..ఒకే వేదికపై కనపడకపోవడం.. ఇప్పుడు కూడా సోము వీర్రాజు సమాధానము దాటవేయడం వెనుక పవన్ ను విశాఖ ఆహ్వానించలేదని పరోక్షంగా అర్ధం అవుతుంది. మరి జనసేన తో కలసి ఎన్నికల వరకు బీజేపీ పొత్తు కొనసాగిస్తుందా?
