సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, మంగళవారం (నవం బరు8వ తేదీ) చం ద్ర గ్రహణం ఏర్ప డటంతో ఆ అద్భు త దృశ్యా న్ని వీక్షించేందుకు ఆసక్తి కనబరిచే వారు కొందరైతే.. గ్రహణం కాబట్టి దాని ప్రభావం లేకుండా జాగ్రత్త పడేవారు మరి కొందరు. సైన్స్ ప్రకారం చంద్రునికి సూర్యు నికి మధ్య గా భూమి వచ్చినపుడు, సూర్యు ని కాంతి చంద్రునిపై పడకుం డా భూమి అడ్డుపడటాన్నే చంద్ర గ్రహణం అంటారు. ఈ రోజు ఈ చంద్ర గ్రహణం ఐరోపా, ఆసియా, ఆస్ట్రేలియా, అమెరికా, భారత్, ఫసిఫిక్, అట్లాంటిక్సహా ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో కనిపించనుంది. భారతకాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.39 నుంచి సాయం త్రం 6.19 గంటల వరకు గ్రహణం సంభవించనుండగా, అందులో సంపూర్ణ చంద్ర గ్రహణం 3.46 నుం చి సాయం త్రం 5.12 గంటల వరకు ఉంటుంది. మొత్తంగా చూస్తే ఈ గ్రహణం ప్రక్రియ పూర్తవడానికి మొత్తం 3 గం టల 40 నిమిషాలు పట్టనుం ది. భారత్ లో చంద్ర గ్రహణం ఏర్ప డే సమయం పగటి పూట కావడంతో అన్ని రాష్ట్రాల్లోనూ సంపూర్ణ చంద్ర గ్రహణాన్ని వీక్షించే అవకాశం ఉండదు. కాగా, మన దేశంలో ఇటానగర్, గుహవాటి, సిలిగురి ప్రాంతాల్లో సంపూర్ణ చంద్ర గ్రహణం చూసే అవకాశం ఉండగా, భువనేశ్వర్, ఢిల్లీ, కలకత్తా, శ్రీనగర్, చెన్నై , గాంధీ నగర్, ముంబై వంటి ప్రాంతాల్లోపాక్షిక చంద్ర గ్రహణం కనిపించనుంది. సాధారణంగా పౌర్ణమి రోజున సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడే అవకాశాలు ఉండవు.
