సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఈ నెల 12న ప్రధాని మోడీ విశాఖ పర్యటిస్తున్న నేపథ్యంలో .. అయన తీసుకొన్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వ్య తిరేకిస్తూ స్థానిక కార్మికులు, నిర్వా సితులు విశాఖ నగరం లోని గాజువాకలో నేడు, బుధవారం ఆందోళనకు దిగారు. వీరికి ఒక్క బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెల్పడం విశేషం. ‘ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ’ ఆధ్వర్యంలో కార్మికులు, నిర్వాసితులు భారీ ర్యాలీ చేసారు. . దీనిలో భాగంగా విశాఖలోని డీఆర్ఎం కార్యాలయం నుంచి జీవీఎం సీ వరకూ తెల్ల జెండాలతో .. ప్రాణత్యాగాలు, ఉద్యమాలతో వచ్చిన స్టీలు ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తారా? అంగీకరించం ..అని నినాదాలు చేస్తూ ర్యాలీగా బయల్దేరగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీ తో పోలీసులు, నిరసనకారుల మధ్య తోపులాట తో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీకి చెం దిన పలువురు నేతలను పోలీసులు అరెస్ట్ చేసి గాజువాక పోలీస్ స్టేషన్ కు తరలిం చారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ సమస్య ను ప్రధాని దృ ష్టికి తీసుకెళ్లేందుకు శాం తియుతం గా ప్రదర్శన చేస్తున్నా మని.. దీన్ని పోలీసులు అడ్డుకోవడం దుర్మా ర్గమని కార్మి కులు ఆగ్రహం వ్యక్తం చేసారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *