సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన షెడ్యూ లు ప్రకారం పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ముసాయిదా ఓటర్ల జాబితాను భీమవరం కలెక్టరేట్ లో విడుదల చేశారు. ఎన్నికల సంఘం జారీ చేసిన షెడ్యూలు ప్రకారం. 2022 ఆగస్టులో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం ప్రారంభం అయింది. ముసాయిదా జాబితాలను జిల్లాలోని అన్ని తహశీల్దారు కార్యా లయాల్లో ఓటర్లకు అందుబాటులో ఉంచుతారు. ముసాయిదా ఓటర్ల జాబితాలో ఏమైనా అభ్యంతరాలుంటే డిశంబర్ 8లోగా తెలియజేయవచ్చు . నిర్ణీత గడువులోగా రెండు శని, ఆదివారాల్లో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేసి స్వీకరిస్తారు. ఓటర్లు తెలిపిన అభ్యంతరాలను డిసెంబరు 26వ తేదీలోగా పరిష్కరించాల్సి ఉంటుంది. తుది జాబితాను 2023 జనవరి 5వ తేదీన విడుదల చేస్తారు. భీమవరం కేంద్రంగా నూతన పశ్చి మగోదావరి జిల్లాలో ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకారం మొత్తం 14,55,308 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుష ఓటర్లు 7,15,248 మంది, మహిళా ఓటర్లు 7,40,141 మంది ఉన్నారు. అలాగే విభజన తరువాత ఏలూరు జిల్లాలో మొత్తం ఓటర్లు 15,86,057 మంది ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 7,79,620 మంది, మహిళా ఓటర్లు 8,06,428 మంది ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *