సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి నేడు, గురువారం మద్యాహ్నం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ లు కలసి జగన్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని, చంద్రబాబు ఈ కుట్ర సినిమా కు స్క్రిప్ట్ అందిస్తుంటే పవన్ నటిస్తున్నాడని అందరికి తెలిసిపోయిందని , ఇటీవల విశాఖలో ప్రజా గర్జన జరుగుతున్నప్పుడు అక్కడ ఉద్రిక్తలు రెచ్చగొట్టేందుకు పవన్ అక్కడకు వచ్చాడని, డ్రామా రక్తి కట్టించే ప్రయత్నం చేసాడని, అది కుదరక మరల ఇప్పటం లో ఎంతో ఆవేశంగా నటిస్తూ డ్రామా చేసాడని ఎద్దేవా చేసారు. పవన్ కు ఎందుకు అంత ఆవేశం.. కోపం.. ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తే వాటిని స్వాధీనం చేసుకోవడం తప్ప? గోడలు కూలిస్తే ఇళ్లే కూల్చేసినట్లు ఇప్పటంలో పర్యటన చేపట్టి గందరగోళం సృష్టించారని మండిపడ్డారు.చంద్రబాబు వస్తే రాష్ట్రంలో కరువు వస్తుందని తెలిసిన.. చంద్రబాబు అధికారంలోకి రావాలనే తాపత్రయంతోనే పవన్ ఇదంతా చేస్తున్నారని విమర్శించారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో మీ రాజకీయ స్వలాభమ్ కోసం తప్పుడు ప్రచారంతో కుట్రలు చెయ్యడం మానుకోవాలని వ్యాఖ్యానించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *