సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం నియోజకవర్గానికి సమీపంలో ఉండే గణపవరం మండలం ఏలూరు జిల్లాలో కలపడం తో ఆ ప్రాంత ప్రజలకు పలు సమస్యలు ఏర్పడటం తో వాటిని గమనించిన సీఎం జగన్.. కొద్దీ నెలలు క్రితం గణపవరం పర్యటనకు వచ్చినప్పుడు తప్పకుండా గణపవరంను పశ్చిమ గోదావరి జిల్లాలో కలుపుతానని హామీ ఇచ్చారు. ఆ హామి చాల త్వరితంగా నేడు, గురువారం నెరవేరింది. నేడు, రాష్ట్ర ప్రభుత్వ జిఓ విడుదల చేసింది.తాజగా నేటి మధ్యాహ్నం గణపవరం ను భీమవరం రెవెన్యూ డివిజన్ లో కలుపుతూ జి ఓ ఆర్ టి 959 ని విడుదల చేసింది. దీనితో గణపవరం ప్రాంతంలోని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
