సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్; ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నియమించిన ఆక్వా సాధికార కమిటీ సమావేశం అయ్యి ఇటీవల వస్తున్నా ఆక్వా సంక్షోభ వార్తలపై ప్రకటన ,ఆదేశాలు జారీ చేసింది. ఆక్వా ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్వాహకులు ఆక్వా రైతులను ఇబ్బంది పెట్టేలా వ్యవహరిస్తే ఊరుకునే ప్రసక్తి లేదు. 100 కౌంట్ రొయ్య లకు కనీసం రూ.210 తగ్గకుం డా చెల్లిం చాల్సిందే. ఇష్టమొచ్చి నట్టు రొయ్య ల ధరలు తగ్గిస్తే చర్యలు తప్ప వు’ అని ఆక్వా సాధికార కమిటీ హెచ్చ రించింది. ఆక్వా రైతులు, ప్రాసెసింగ్ యూనిట్ల నిర్వా హకులు, సీడ్, ఫీడ్ కం పెనీల ప్రతినిధులతో ఏపీఐఐసీ భవనం లో గత గురువారం ఆక్వా సాధికార కమిటీ భేటీ సుదీర్ఘంగా జరిగింది. రాష్ట్ర పశు సంవర్ధక, మత్స్య శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్ప లరాజు మాట్లాడుతూ రైతులకు అండగా నిలిచే విషయంలో ప్రాసెసింగ్ కంపెనీలు నిలబడాలని కనీసం 10 రోజులపాటు ఇవే ధరలు కొనసాగాలని, ప్రభుత్వం రోజూ కొనుగోళ్లు, ధరలను సమీక్షిస్తుందని చెప్పా రు. జాతీయ రొయ్య రైతుల సంఘం అధ్య క్షుడు ఐపీఆర్ మోహన్ రాజు మాట్లాడుతూ,.. ప్రాసెసిం గ్ కం పెనీలను ఇబ్బంది పెట్టడం తమ ఉద్దేశం కాదని, వాళ్లెంత కొనుగోలు చేయగలరో ముందే చెబితే ఆ మేరకే ఇక నుంచి ఉత్పత్తి చేస్తామని చెప్పారు. మార్కెట్ లేనప్పుడు ఎందుకు 80 బిలియన్ల సీడ్, 16 లక్షల టన్నుల ఫీడ్ ఉత్పత్తి చేస్తున్నారని సూటిగా ప్రశ్నించారు. అమెరికా మార్కెట్ ఆగిపోయిందని, చైనా మార్కె ట్ ఓపెన్ కాలేదని, అందువల్లే పూర్తి స్థాయిలో రోయ్యలను కొనుగోలు చేయలేకపోతున్నామని పలువురు ప్రాసెసింగ్ యూనిట్స్ నిర్వాహకులు సాధికార కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. అయిన ప్రస్తుతం రైతుల వద్ద ఉన్న సరుకును ప్రభుత్వం నిర్దేశించిన ధరలకు కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు.
