సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్; దక్షిణ భారత దేశంలో తొలి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ను అధికారికంగా . భారత ప్రధాని నరేంద్ర మోదీ నేడు, శుక్రవారం కర్ణాటక బెంగళూరు క్రాంతివీర సంగోలీ రాయన్న రైల్వే స్టేషన్ నుండి రైలును ప్రారంభించారు. చెన్నై (తమిళనాడు) నుంచి వయా బెంగళూరు మీదుగా మైసూర్ మధ్య ఈ రైలు ఇకపై ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చింది. దేశంలో ఇప్పటివరకు పరుగులు పెడుతున్న సెమీ హైస్పీ డ్ వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్ల లో ఇది ఐదవది. మిగతా నాలుగు రైళ్లు ఉత్తరభారత దేశములో ఇప్పటికే పరుగులు పెడుతూ నడుస్తున్నాయి. ఇప్పటికే ఈ మైసూర్-చెన్నై వందే భారత్విజయవంతం గా ట్రయల్ రన్ పూర్తి చేసుకుంది కూడా. వందే భారత్ రైలు ప్రారంభం తో పాటు భారత్ గౌరవ్ కాశీ దర్శన్ రైలు కు సైతం ప్రధాని మోదీ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు.
