సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: సీఎం జగన్ ఆదేశాల మేరకు గణపవరం మండలాన్ని పశ్చిమగోదావరి జిల్లాలోకి చేరుస్తూ.. ఇకపై ఏలూరు రెవెన్యూ డివిజన్ నుంచి భీమవరం రెవెన్యూ డివిజన్లోకి మారుస్తూ రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ సాయిప్రసాద్, గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో ఇప్పటికి వరకు 19 మండలాలు ఉన్న పశ్చిమ గోదావరి జిల్లా ఇకపై 20 మండలాలు ఉన్న జిల్లాగా మారనుంది. ఇప్పటి వరకు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు రెవెన్యూ డివిజన్లతో 2,178 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 17.80 లక్షల జనాభా కలిగి ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో కొత్తగా గణపవరం మండలాన్ని కూడా విలీనంచేయడంతో అదనంగా 100 చదరపు కిలోమీటర్ల మేర విస్తీర్ణం , 65 వేల మంది జనాభా పశ్చిమ గొడవరి జిల్లా లో కలిసిపోతుంది. ఓటర్లు సంఖ్యా కూడా పెరుగుతుంది.
