సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: భీమవరం వన్ టౌన్ లోని స్థానిక ఇండియన్ బ్యాంకు రోడ్డులో నేటి ఆదివారం ఉదయం 6న్నర సమయంలో అగ్నీ ప్రమాదం సంభవించింది. స్థానికంగా ప్రముఖ కిరాణా షాపుగా పేరొందిన అడ్డంకి శివ కిరానా షాప్ నుండి పెద్ద ఎత్తున పొగలు రావడంతో (మూసివేసిన షాప్)స్థానికులు పిర్యాదు చెయ్యడంతో ఫైర్ ఇంజన్ వారు శరవేగంగా వచ్చి మంటలు ఆర్పే ప్రకియ మొదలు పెట్టారు, అయితే షాప్ నిర్వాహకులు నిన్న రాత్రే అన్నవరం దర్శనానికి వెళ్లటంతో షాప్ తాళాలు లేక అగ్నిమాపక సిబ్బంది షాప్ ఐరన్ డోర్ తాళాలు బ్రద్దలు కొట్టే పనిచేసారు ( సిగ్మా న్యూస్ సహకారంతో శివగారి బంధువులు తాళాలు తెచ్చారు, అయితే వాటిని తెరవడం కష్టం కావడంతో డోరు తాళాలు బ్రద్దలు కొట్టారు) లోపల లక్షలాది రూపాయలు విలువైన సరుకులు అంత అగ్ని కి ఆహుతి అయ్యాయి. నిజంగా ఫైర్ ఇంజన్ వాళ్ళ మంచి కృషి చేసి మంటలను క్షణాల్లో అదుపులోకి తెచ్చారు, అయితే షాప్ ఫై ఫ్లోర్ భాగానికి మంటలు అంటుకోక పోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. షాప్ వెనుక నివాసం ఉంటున్న గృహాలకు ప్రమాదం తప్పింది. కాకపోతే భారీగా మిరపకాయలు కాలిన నేపథ్యంలో స్థానికులకు ఇబ్బంది కలిగింది.షార్ట్ షార్ట్ సర్కూట్ వల్ల ప్రమాదం జరిగి ఉండవచ్చునని ప్రాధమిక సమాచారం.. పూర్తీ సమాచారం దర్యాపులో తెలుస్తుంది.
