సిగ్మాతెలుగు డాట్ ఇన్ న్యూస్: జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు నేడు, సోమవారం జనసేన పార్టీ పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులు, భీమవరం నియోజకవర్గం ఇన్ ఛార్జ్ శ్రీ కొటికలపూడి గోవిందరావు ఆధ్వర్యంలో జగనన్న ఇళ్ళ స్థలాల అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ… సోషల్ ఆడిట్ కార్యక్రమం లో భాగంగా నేటి ఉదయం తాడేరు రోడ్డులో ఇందిరమ్మకాలనీ వద్ద గల హౌసింగ్ డిపార్టుమెంటు కార్యాలయం వద్ద సోషల్ ఆడిట్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇప్పటివరకు భీమవరం నియోజకవర్గంలో నిర్మిస్తున్న ఇళ్లు ఎంతవరకు పూర్తయినాయి అని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈ ప్రభుత్వం నిర్మిస్తున్న ఇళ్లకు కనీస సౌకర్యాలు రోడ్లు, వాటర్ రిజర్వాయర్,కల్పించకుండా ప్రధాన రహదారులకు 5అడుగుల దిగువన నిర్మిస్తున్నారు. ఇలా నిర్మిస్తున్న ఇళ్లు మరో ఇందిరమ్మ గృహాల మాదిరిగా డ్రైనేజ్ వ్యవస్థ లేక ప్రజలు ఇబ్బందిలకు గురవుతారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి, భీమవరం పట్టణ అధ్యక్షుడు చెనమల్ల చంద్ర శేఖర్, భీమవరం మండల అధ్యక్షుడు మోకా శ్రీనివాస్, సెక్రటరీ కత్తుల నీలేంద్ర,నాయకులు బండి రమేష్ కుమార్,MpTC లు తాతపూడి రాంబాబు, ఆరేటి వాసు, మాజీ కౌన్సిలర్స్ మాగాపు ప్రసాద్, వానపల్లి సూరిబాబు తదితర నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు పాల్గొన్నారు.
