సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: తాజగా నేడు, బుధవారం ఆంధ్ర ప్రదేశ్లో జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కేంద్రాల ఖరారుకు ఎన్నికల కమిషన్ షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబర్ 11వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫొటో ఓటర్ల జాబితాలను ఎన్నికల కమిషన్ అధికారులు ప్రదర్శించనున్నారు. సెప్టెంబర్ 14వ తేదీన పోలింగ్ కేంద్రాల ముసాయిదా (Draft) జాబితా రూపకల్పన చేయనున్నారు. సెప్టెంబర్ 15, 16 తేదీల్లో పోలింగ్ కేంద్రాలపై అభ్యంతరాలు, వినతులను స్వీకరించనున్నారు. సెప్టెంబర్ 16వ తేదీన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల కమిషన్ అధికారులు సమావేశం కానున్నారు. సెప్టెంబర్ 18వ తేదీన పోలింగ్ స్టేషన్ల జాబితాకు జిల్లా కలెక్టర్లు ఆమోదం ప్రకటిస్తారు.. సెప్టెంబర్ 19వ తేదీన ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్ కేంద్రాల తుది జాబితా విడుదల చేస్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *