సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2027 గోదావరి పుష్కరాలకు వచ్చే భక్తులకు మెరుగైన రవాణా సౌకర్యాల కల్పనే లక్ష్యంగా గోదావరి జిల్లాలో ఆర్ & బీ రోడ్ల అభివృద్ధికి రూ. 300 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ మేరకు ఏపీ ఆర్ అండ్ బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తాజగా నేడు, బుధవారం ప్రకటన విడుదల చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ తక్షణం ఈ నిధుల విడుదలకు ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. గోదావరి పరివాహక ప్రదేశాలు ఉన్న 6 జిల్లాల పరిధిలో 431 కిలోమీటర్ల మేర 78 రోడ్లకు మహర్దశ వచ్చిందని తెలిపారు.. 275 కిలోమీటర్ల మేర స్టేట్ హైవే (SH)లకు రూ.185.75 కోట్ల నిధులను విడుదల చేశామని తెలిపారు. 155 కిలోమీటర్ల మేర జిల్లా ప్రధాన రహదారులు (MDR)లకు రూ.114.25 కోట్ల నిధులను విడుదల చేశామని చెప్పారు.
