సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: రిలయన్స్ జియో మరో భారీ సంచలనానికి రంగం సిద్ధం చేసుకొంటుంది. తొలిసారి అత్యంత తక్కువ ధరకే .. అంటే సుమారుగా 15,000 రూపాయల ధరకు కాస్త అటు ఇటుగా ల్యాప్‌టాప్‌లను మార్కెట్లో విక్రయించేందుకు సిద్దము అయ్యింది. ‘ జియోబుక్ ’ పేరిట ఈ నెల అక్టోబర్‌లోనే ల్యాప్‌టాప్‌లను విడుదల చేయబోతోంది. ఇందుకు సంబంధించి క్వాల్‌కామ్, మైక్రోసాఫ్ట్ లతో జియో భాగస్వామ్యం కుదుర్చుకుందని రాయిటర్స్ రిపోర్ట్ పేర్కొంది. తొలుత 4జీ సౌలభ్యమున్న జియోబుక్ ల్యాప్‌టప్‌లను అందుబాటులోకి తీసుకురానుందని, దీని ధర 184 డాలర్లుగా ఉండనుందని పేర్కొంది. భారతీయ కరెన్సీలో దీని విలువ సుమారు రూ.15 వేలుగా ఉండొచ్చని రిపోర్టు ప్రస్తావించింది.కాగా జియో తొలుత 4జీ సౌలభ్యమున్న ల్యాప్‌టాప్‌లనే మార్కెట్లోకి తీసుకురానుందని, వచ్చేఏడాది 5జీ ఫోన్ ఆవిష్కరణ తర్వాత 5జీ వెర్షన్ ల్యాప్‌టాప్‌లను మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకురానుందని రిపోర్ట్ వెల్లడించింది. జియోబుక్ ల్యాప్‌టాప్‌లు తొలుత స్కూళ్లు, ప్రభుత్వ సంస్థలు వంటి సంస్థల కస్టమర్లకు అక్టోబర్ 2022లోనే అందుబాటులోకి వస్తాయి. మరో 3 నెలల్లోనే మిగతా కస్టమర్లు అందరికీ ల్యాప్‌టాప్‌లు లభ్యమవుతాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *