సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల భారత్ తో స్నేహబంధం బలోపేతం చేసుకొంటున్న ఆఫ్ఘనిస్తాన్ రాజధాని కాబూల్ బాంబులతో దద్దరిల్లింది. నగరంలోని అనేక చోట్ల వైమానిక దాడులు రాత్రి పేలుళ్లు, కాల్పుల శబ్దాలు వినిపించాయి. స్థానిక, విదేశీ మీడియా అందిస్తున్న సమాచారం ప్రకారం, మృతుల సంఖ్య ఇంకా స్పష్టంగా తెలియరాలేదు..అయితే, ఈ వైమానిక దాడులు ఎవరు చేశారనే దానిపై అధికారికంగా సమాచారం లేదు. అయితే ఇటీవల అమెరికా అడ్జక్షుడు ట్రంప్ ఆప్ఘనిస్తాన్ ను హెచ్చరించిన నేపథ్యంలో.. పాకిస్తాన్ చొరవ తో గుర్తు తెలియని విమానాల ద్వారా వైమానిక దాడులు జరిగినట్టు సోషల్ మీడియా పోస్ట్‌లు పేర్కొన్నాయి. కాగా, తాలిబన్ తాత్కాలిక పరిపాలన ప్రధాన ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ పేలుళ్లపై దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారని స్థానిక మీడియా ప్రకటించింది.
