సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్:పెట్రోలు, డీజిల్ సాధన కోసం ప్రజలు వాహనదారులు బంకుల వద్ద నిరీక్షణతో అతలాకుతలం అయిపోతున్న నేపథ్యంలో భీమవరంలో మరొక 24 గంటల్లో డీజిల్ సరఫరా పరిస్థితి సాధారణంగా స్థితిలోకి రానుందని, అవసరానికి మించి డీజిల్ కొనుగోలు చేయవద్దని స్థానిక ఎమ్మెల్యే పులపర్తి అంజిబాబు విజ్ఞప్తి చేసారు. భీమవరం – ఉండి రోడ్డులోని పెట్రోల్ బంక్‌ లను ఎమ్మెల్యే అంజిబాబు ఆకస్మికంగా తనిఖీ చేసి స్టాక్, అమ్మకాల వివరాలను అడిగి పరిశీలించారు. డీజిల్ సరఫరా పరిస్థితుల వివరాలను తెలుసుకున్నారు. అపోహలకు లోనవకుండా అవసరానికి అనుగుణంగా మాత్రమే డీజిల్ కొనుగోలు చేయాలన్నారు. రైతులకు డీజిల్ సరఫరాలో అంతరాయంగా లేకుండా చూడాలని బంక్ యజమానులు సహకరించాలని సూచించారు. .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *