సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవాలయం నేడు, గురువారం అట్లతద్ది పర్వదినం నేపథ్యంలో మహిళా భక్తులతో మరింత కోలాహలంగా ఉంది. ఈ నేపథ్యంలో నేడు, గురువారం ఉదయం శ్రీ అమ్మవారిని దర్శించుకున్న భక్తులు హైదరాబాద్ కి చెందిన T.N.G.P.S ఎస్టేట్ లిమిటెడ్స్, టి అమరలింగేశ్వరరావు దంపతులు ‘శ్రీ అమ్మవారికి స్వర్ణవస్త్రంనిధికి‘, సుమారుగా రెండు లక్షలు పాతిక వేలు రూపాయలు విలువైన 19 గ్రాములు 600 మిల్లి గ్రాములు బంగారం కానుకగా అందించారు. వీరికి ఆలయ ఉపప్రధానఅర్చకులు ఆధ్వర్యంలో పూజలు ఆశీర్వచనలు నిర్వహించి శేషవస్త్రం ప్రసాదం ఫోటో అందజేశామని ఆలయ సహాయ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ తెలిపారు.
