సిగ్మాతెలుగు డాట్, ఇన్ న్యూస్: కారణాలు ఏవైనా ఇటీవల సనాతన వాదీ గా కాషాయ గెటప్ కు దూరంగా ఉన్నఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) మరోసారి సనాతర ధర్మ పరిరక్షణపై కీలక వ్యాఖ్యలు చేశారు. హిందూ సనాతర ధర్మ పరిరక్షణ కోసం ఓ ప్రత్యేక బోర్డు అవసరమని, ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ట్వీట్ పెట్టారు డిప్యూటీ సీఎం. ప్రపంచవ్యాప్తంగా హిందూ సమాజానికి, తిరుమల తిరుపతి దేవస్థానం ఒక తీర్థయాత్ర కేంద్రం కంటే ఎక్కువ అని అభివర్ణించారు. తిరుపతి లడ్డూ కేవలం తీపి కాదని.. ఇది ఒక ఉమ్మడి భావోద్వేగమని ఉద్ఘాటించారు. ప్రతి సంవత్సరం దాదాపు 2.5 కోట్ల మంది భక్తులు ప్రపంచ హిందూ ఆధ్యాత్మిక కేంద్రంగా తిరుమలను సందర్శిస్తారని చెప్పారు. ( up file photo)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *