సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు అస్వస్థతకు గురయ్యారు. నిన్న శుక్రవారం కుటుంబ సభ్యులు ఆయనను హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత యాంజియోగ్రామ్ నిర్వహించిన డాక్టర్లు గుండె రక్తనాళాల్లో సమస్యను గుర్తించినట్లు తెలుస్తోంది. యాంజియోప్లాస్టీ చేసి స్టెంట్ వేసినట్లు ఆయన కోలుకొంటునట్లు నేడు, శనివారం డాక్టర్లు తెలిపారు. చికిత్స తర్వాత అంబటి రాంబాబును వైద్యుల ప్రత్యేక పర్యవేక్షణలో ఉన్నారు. ఈ విషయం తెలిసి వైసీపీ శ్రేణులు, అంబటి రాంబాబు అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది
