సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఇటీవల రాష్ట్రంలో ఎక్కడ చుసిన ఏదొక మానసిక, ఆర్ధిక ఆందోళనతో క్షణిక ఆవేశంలో ప్రజలు ఆత్మహత్య లకు పాలబడుతుండటం ఆందోళన రేకెత్తిస్తుంది. పశ్చిమగోదావరి జిల్లాలో భార్యాభర్తలు తాజగా నేడు, శనివారం చించినాడ బ్రిడ్జిపైనుంచి దూకి గల్లంతయ్యారు. వేల్పూరుకు చెందిన దొడ్డా వెంకట ధనసాయికృష్ణ, శిరీష దంపతులు ప్రస్తుతం భీమవరంలో నివాసం ఉంటున్నారు. సాయికృష్ణ గోదావరిలోకి దూకే ముందు మాట్లాడిన ఆడియో, అంతకు ముందు రెండు రోజుల క్రితం ఉరివేసుకుంటానని చెబుతున్న వీడియో వైరల్ అయ్యింది. కొందరి ఒత్తిళ్ల కారణంగానే దంపతులు ఇలా చేశారని సాయికృష్ణ తల్లిదండ్రులు ఆరోపించారు. సాయకృష్ణ భార్య, కుమారుడితో సహా ఆత్మహత్య చేసుకుందామనుకున్నాడు.. కానీ చివరి నిమిషంలో బాలుడ్ని అక్కడే వదిలేసి గోదావరిలో దూకేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఇదిలా ఉండగా విశాఖపట్నం జిల్లా పెందుర్తిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. చింతలగ్రహారం కాలనీలో మల్లా ప్రవీణ్ కుమార్ భార్య, ఇద్దరు కుమార్తెలతో కలిసి ఉంటున్నారు. ప్రవీణ్ ముందుగా తన భార్య, ఇద్దరు కుమార్తెలకు విషం ఇచ్చి.. తర్వాత తను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం రాఖీ కావడంతో కుటుంబంతో సరదాగా గడిపి . రాత్రికి ప్రాణాలు తీసుకోవడం తీవ్ర విషాదాన్ని నింపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *