సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: వయస్సు పెరుగుతున్న ఇప్పటికి మన్మదుడుగానే నిలబడిన టాలీవుడ్ అగ్ర సీనియర్ హీరో అక్కినేని నాగార్జున పుట్టినరోజు సందర్భముగా నేడు, శనివారం ఆయన కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకమైన 100వ చిత్రానికి సంబంధించిన అధికారిక అప్‌డేట్ తాజాగా విడుదల చేసారు. వచ్చేసింది. ‘కింగ్ 100’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ మరియు ప్రత్యేక గ్లింప్స్‌ను చిత్రబృందం విడుదల చేసింది. కోలీవుడ్ దర్శకుడు రా. కార్తీక్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఇందులో నాగార్జున 3 తరాల వ్యక్తిగా మూడు గెటప్ లలో కనిపిస్తారని తెలుస్తుంది. ‘కింగ్ 100’ గ్లింప్స్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటూ సినిమాపై భారీ అంచనాలను పెంచేసింది
