సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: నేడు, శుక్రవారం పీఎం-కిసాన్‌ పథకం కింద దేశంలోని 9.34 కోట్ల మంది రైతుల బ్యాంకు ఖాతాల్లోకి శుక్రవారం ప్రధాని మోదీ నిధులను జమ చేసారు.. 24వ విడత కింద రూ.18,690 కోట్లు నేరుగా రైతుల ఖాతాల్లోకి బదిలీ కానున్నాయి. గుజరాత్‌లోని బనస్కాంతలో రైతుల సమక్షంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ నిధులను బదిలీ చేసారు. . ఏపీలో మంత్రి అచ్చేమ్ నాయుడు మాట్లాడుతూ.. రైతు భరోసా నిధులను రైతులకు విడుదల చేశామని, రైతులకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.14 వేలు, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ ద్వారా రూ.6 వేలు సమకూరుస్తున్నాయని వివరించారు అన్నదాత సుఖీభవ–పీఎం కిసాన్ పథకం రెండో విడత కింద రాష్ట్రవ్యాప్తంగా 46.85 లక్షల రైతు కుటుంబాలకు రూ.3,125.47 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు ఏర్పాట్లు చేసింది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *