సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆర్నబ్’ తుపాను ఊహించని రీతిలో భీమవరం ఫై నుండి తీరం దాటే పక్రియ సుమారు 18 గంటల పాటు కొనసాగడంతో ప్రజలు వ్యాపారులు దారుణంగా నష్టపోయారు. స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు నేడు, శుక్రవారం ఉదయం నుండి తుపాను దాటికి దెబ్బ తిన్న వ్యవసాయ పొలాలను పరిశీలించారు. భీమవరం మండలంలో గునుపూడి, తాడేరు రోడ్డు, యనమదుర్రు రోడ్డు, గొల్ల వాని తిప్ప రోడ్డు మరియు కొవ్వాడ అన్నవరం సందర్శిస్తున్నారు. మన్నా చర్చ్ ఎదురుగా కరెంట్ పోల్, చెట్టు పడటంతో మృతి చెందిన చొక్కా కిషోర్ కుమార్ నివాసానికి ఎమ్మెల్యే అంజిబాబు చేరుకుని వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అదే విధంగా బోండాడ విడిది ఇల్లు దగ్గర పి రాంబాబు మెడపై కరెంట్ పోల్, చెట్టు పడిపోవడంతో మెడ నరాలు దగ్గర తీవ్ర దెబ్బలు తగలడంతో భీమవరం ఆసుపత్రికి చికిత్స పొందుతున్నారు. ఎమ్మెల్యే అంజిబాబు ఆసుపత్రికి చేరుకుని రాంబాబును పరామర్శించారు..తుఫాన్ ప్రభావం ఈదురు గాలులతో భీమవరం నియోజక వర్గంలో ఎన్నో చోట్ల ఇళ్ళు పై కప్పులు, ధ్వంసం కావడం చాలా బాధాకరమని నష్టపోయిన ప్రజలకు, రైతులకు ప్రభుత్వ సాయం అందేలా ఏర్పాటు చేస్తామని అన్నారు. భీమవరం బ్యాంక్ కాలనీలో తుపాన్ ప్రభావంతో ధ్వంసమైన వెంకట్ బ్యాడ్మింటన్ అకాడమీ ను ఎమ్మెల్యే అంజిబాబు పరిశీలించారు. ఎన్నో ఏళ్లుగా క్రీడాకారులు ఈ బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ పొందుతున్నారని, ఈ తుఫాన్ ప్రభావంతో బ్యాడ్మింటన్ అకాడమీ పూర్తిగా ధ్వంసం కావడం బాధాకరమన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *