సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: ఆర్నబ్’ తుపాను దాటికి ఏపీలో గోదావరి జిల్లాల లో ఊహించిన దాని కంటే ఎక్కువ నష్టం జరిగింది. నర్సాపురం భీమవరం మధ్య తుపాను తీరం దాటటంలో 140 కిలో మీటర్లు వేగంతో వీచిన గాలుల ప్రభంజనానికి గత 4 రోజులుగా జనజీవితం స్తంభించిపోయింది. గోదావరి జిల్లాలలో ఆర్ధిక రాజధాని గా పేరున్న భీమవరంలోనే 3 రోజులు కరెంట్ సరఫరా ఇంటర్ నెట్ సరఫరా నిలిచిపోయిందంటే పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా పరిస్థితి ఎంత దారుణంగా ఉందొ అర్ధం చేసుకోవచ్చు.. ఇప్పటికి భీమవరం తో పాటు గోదావరి జిల్లాలలో పలు ప్రాంతాలు పట్టణాలలో ఇప్పటికి 70 శాతం కరెంట్ సరఫరా పునరుద్ధరణ పనులు పూర్తీ చేసారు. భారీ ఆస్తి నష్టంతో పాటు ఇద్దరు చనిపోవడం పలువురు గాయపడటం జరిగింది… చెట్లు, కరెంట్ స్తంబాలు పడిపోవడం కేబుల్, ఇంటర్ నెట్ కేబుల్స్, వ్యాపార సంస్థల బోర్లు ఫ్లెకిస్ కి లేచిపోవడం ఓవర్ బిడ్జ్ దగ్గర స్థానిక మునిసిపల్ కాంప్లెక్స్ గోడలు పడిపోవడం , చేతి వృతి కళాకారుల ఏర్పాటు చేసుకొన్నా రాయల్ క్రాఫ్ట్ బజారు తీవ్రంగా ద్వంసం అయ్యింది. హోటల్స్ నేటి శుక్రవారం ఉదయానికి కూడా అరకొర తప్ప తెరుచుకోలేదు. జనరేటర్లు ఉన్న లార్జిలు మాత్రం హౌస్ ఫుల్.. ఫోన్ లు ఛార్జ్ చేసుకోవానికి కొన్ని షాపులలో జనరేటర్లు పెట్టి 50 రూపాయలు చప్పున వసూళ్లు చేసారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు.. జనానికి నిద్రలేదు.. పలు కుటుంబాలకు ఆకలితో పస్తులు కూడా ఉన్నాయి. ఇప్పటికి పరిస్థితులు కుదుట పడుతున్నారు. కావాల్సినంత మంది లేకపోయిన పారిశుధ్య కార్మికులు, ట్రాన్స్ కో సిబ్బంది రాత్రి పగలు చేసిన సేవలకు చేతులు ఎత్తి దండం పెట్టవచ్చు. తుపాను తీరం ఫిలిప్పైన్స్ దేశానికి చెందిన ఓ మర్చంట్ షిప్ అంతర్వేది వద్ద సముద్రంలో నిలిచిపోవడం గమనార్హం.
