సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: భీమవరం పురాధీశ్వరి శ్రీశ్రీశ్రీ మావుళ్ళమ్మ వారి దేవాలయంలో దసరా మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ రోజు మంగళవారం మానవాళి కి సకల వేద సారం అనుగ్రహిస్తున్న, వేదమంత్రాలు అధిదేవత, శ్రీ గాయత్రీ దేవి అవతారంలో శ్రీ మావుళ్ళమ్మవారి భక్తులను అనుగ్రహిస్తున్నారు, 5 శిరస్సులతో 10 చేతులతో నిలువెత్తు శ్రీ గాయత్రీ దేవి అలంకరణలో శ్రీ అమ్మవారిని చూడటానికి భక్తులు విశేషంగా హాజరు అవుతున్నారు. ప్రతి సాయంత్రం దేవాలయ ఆవరణలో పలు ఆధ్యాత్మిక , సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
