సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: కలియుగ వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమలలో శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తుల సౌకర్యార్థం ‘వేంకటాద్రి’ యాప్ నేడు, మంగళవారం ప్రారంభమైంది. . ఏఐ వాయిస్ అసిస్టెంట్ 24 గంటల పాటు సేవలందిస్తుంది. మొత్తం 25 విభాగాల్లో 350కు పైగా ప్రదేశాల వివరాలు యాప్‌లో ఉంటాయి. తెలుగు సహా ఐదు భాషల్లో ఈయాప్ అందుబాటులో ఉంటుంది. భక్తులకు అక్కడి లొకేషన్స్ గురించి సమాచారం,. రూమ్‌లు తీసుకోవడానికి ఎక్కడికి వెళ్లాలి?. దర్శనం క్యూ లైన్లకు ఎలా వెళ్లాలి, అన్నప్రసాదం ఎక్కడ ఉంటుందో తెలియాలంటే.. ఈ ఒక్క యాప్ ఉంటే చాలు.. తిరుమలలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు వేంకటాద్రి మొబైల్ యాప్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు. అమెరికాకు చెందిన ఎన్నారై దాత జేపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వేంకటాద్రి యాప్ పనితీరును వివరించారు.
