సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ట్రంప్ పార్టీకి అందరు ఊహించినట్లే ఘోర పరాభవం ఎదురయింది. అమెరికా సెనేట్‌తోపాటు ప్రతినిధుల సభలోనూ ప్రతిపక్ష డెమోక్రాట్లు భారీ మెజార్టీ సాధించారు. తప్పుడు నిర్ణయాలతో ప్రపంచాన్ని ముంచేసిన ట్రంప్, తన ప్రభుత్వ విధానాలతో నిత్యావసరాల రేట్లు భారిగా పెరగటం తో అమెరికాలో కూడా విసిగిపోయిన ప్రజలు.. డెమోక్రాట్ల వైపు మొగ్గారు. దీనితో ప్రస్తుతం అధ్యక్షుడిగా ట్రంప్ కొనసాగుతున్నప్పటికీ, అమెరికా కాంగ్రెస్ (పార్లమెంట్)లో ఆయన నిర్ణయాలను ఇకపై అడ్డుకునే రాజకీయ శక్తి డెమోక్రాట్ల కు లభించింది. నవంబర్ 3న జరిగిన ఎన్నికల్లో ప్రతినిధుల సభలోని మొత్తం 435 స్థానాలకు, సెనేట్‌లో 35 స్థానాలకు, 36 రాష్ట్రాల గవర్నర్ పదవులకు పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికలు అధ్యక్ష ఎన్నికలు కావు. అయినప్పటికీ అమెరికా అధ్యక్షుడి రెండేళ్ల పాలనపై ప్రజలు ఇచ్చే మధ్యంతర తీర్పుగా వీటికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. ఇకపై హెచ్-1బీ వీసాల విషయంలో కఠినమైన నిబంధనలు భారతీయ ఐటీ ఉద్యోగులపై వాటి ప్రభావం వంటి అంశాలపై డెమోక్రాట్లు భిన్నమైన వైఖరిని వ్యక్తం చేసే అవకాశం ఉంది.
