సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: పశ్చిమ గోదావరి జిల్లా లో ఎటువంటి పిర్యాదులు లేకుండా చాల ప్రశాంతంగా జరిగిన ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికల్లో కూటమి తరఫున తెలుగు దేశం ఛైర్పర్సన్ అభ్యర్థిగా ఎన్నికలలో విజయం సాధించిన డా. నీలోఫర్ షేక్ , మరియు 23 మంది కౌన్సిలర్లు నేడు, బుధవారం భీమవరం పట్టణ శివారులోని పెదమిరంలో ..శాసనసభ డిప్యూటీ స్పీకర్ మరియు ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు ని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో ఘన విజయం సాధించిన ఛైర్పర్సన్, కౌన్సిలర్లను రఘురామ’ అభినందించి శుభాకాంక్షలు తెలిపారు ఆకివీడు పట్టణ అభివృద్ధికి ప్రజల సౌకర్యాల కోసం కృషి చేయాలన్నారు.
