సిగ్మా తెలుగు డాట్, ఇన్ న్యూస్: దక్షిణ అండమాన్ సముద్రంపై ఏర్పడే ఉపరితల ఆవర్తన ప్రభావంతో నవంబర్ 30వ తేదీ నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది. ఆపై ఈ అల్పపీడం డిసెంబర్ 2వ తేదీకి మరింత బలపడి వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. దీని ప్రభావంతో ఏపీలో కూడా వర్షాలు పడే అవకాశం ఉందని,ఇది పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ తమిళనాడు లేదా శ్రీలంక తీరాల వైపు కదిలే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది. అయితే వివిధ వాతావరణ మోడల్స్ ప్రకారం ఈ వాయుగుండం సముద్రంలోనే బలహీనపడే సూచనలు కనిపిస్తున్నట్లు ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *